Saturday, November 23, 2024

MadhyaPradesh | కునోలో మరో చిరుత మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయపార్కులో మరో చిరుత మరణించింది. ఆఫ్రికా దేశం నమీయా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఇదొకటి. దీనిపేరు శౌర్య. మంగళవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తడబడుతూ నడవటాన్ని గుర్తించిన ట్రాకింగ్‌ బృందం, బలహీనంగా ఉన్నట్లు నిర్దారించి చికిత్స అందించారు. ఆ తర్వాత కోలుకున్నట్లు కనిపించినా, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అది మరణించిునట్లు అధికారులు వెల్లడించారు.

కునో పార్కులో శౌర్యతో సహా ఇప్పటి వరకు పది చిరుతలు మరణించాయి. అంతరించి పోయిన ఈ వన్యప్రాణి జాతిని పున;ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చీతాను చేపట్టింది. నబీబియా, ద.ఆఫ్రికా దేశాల నుంచి రెండు విడుతల్లో 20 చిరుతలను భారత్‌కు రప్పించారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ఉంచారు. ఇందులో ఆరు ఇదివరకే మరణించాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే నమీబియా చిరుతకు నాలుగు కూనలు జన్మించగా వాటిలో మూడు మృతి చెందాయి. తాజాగా శౌర్య మృతితో ఇప్పటి వరకు మరణించిన చిరుతల సంఖ్య 10కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement