హైదరాబాద్, ఆంధ్రప్రభ : మరో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు రట్టు చేశారు. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న సప్లయర్తో పాటు మరో నలుగురు ఫెడ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 36 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. మరో పదహారు మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి అందులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరందరినీ ఈ కేసులో చేర్చినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా చెన్నైలోని ఓ కాలేజీలో చదువుతున్నపుడు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారు నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే వారని ఆయన చెప్పారు.
చెన్నైలో చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత వీరంతా డ్రగ్స్ ఫెడ్లర్లుగా మారారని వీరు నిషేధిత మాదక ద్రవ్యాలను గ్రాము రూ.7వేల చొప్పున విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విష్ణు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని ఆయన వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.