తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో పాస్ అయిన వారందరూ తమ భవిష్యత్తు ప్రణాళికల్లో మునిగిపోగా.. ఫెయిలైన వారు మాత్రం తమ జీవితాలు ఇక్కడితో ఆగిపోయాయనే బాధలో ఉంటున్నారు. అంతే కాకుండా మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈ ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో 9 మంది బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఇంటర్ విద్యార్థిని గాయత్రి ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది. హస్తినాపురం లోని నవీన కళాశాలలో గాయత్రి చదువుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరం తప్పడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తన చెల్లెలు పాసై.. తాను ఫెయిల్ కావడంతో మనోవేదనకు గురైన గాయత్రి ఈరోజు ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇప్పటి వరకూ ఆత్మ హత్య చేసుకున్న వారి సంఖ్య 10 కి చేరింది