Friday, November 22, 2024

TS | ఔట‌ర్‌పై మ‌రో ఇంట‌ర్ చేంజ్‌.. నార్సింగ్ వ‌ద్ద ఎగ్జిట్‌పాయింట్ ప్రారంభం

హైద‌రాబాద్‌ ఔటర్ పై మ‌రో ఎగ్జిట్ ఇవ్వాల (శ‌నివారం) ప్రారంభ‌మయ్యింది. ఔట‌ర్‌పై జ‌ర్నీని మ‌రింత ఈజీ చేసేలా హెచ్ ఎండీఏ ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది. హైదరాబాద్‌లోని రింగ్‌రోడ్‌లో కొత్త ఇంటర్‌చేంజ్ సౌకర్యాన్ని ఇవ్వాల ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించారు. నార్సింగి జంక్షన్ వద్ద వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా ఈ ఎగ్జిట్‌ ఉంటుంది. ఈ ఇన్‌ఫ్రా అప్‌గ్రేడ్ వల్ల రద్దీగా ఉండే రహదారిపై ట్రాఫిక్ తగ్గుతుందని కూడా భావిస్తున్నారు. నార్సింగి ఇంటర్‌చేంజ్ నిర్మాణాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), తెలంగాణ రాజధాని హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ సజావుగా ఉండేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కొత్త కొత్త నిర్మాణాల‌ను చేప‌డుతోంది.

ఇక‌.. నార్సింగి ఇంటర్‌చేంజ్‌ను శనివారం మంత్రి కెటి రామారావు ప్రారంభించారు. ఈ ORR ఇంట‌ర్ చేంజ్ ద్వారా నార్సింగి, మంచిరేవుల, గండిపేట ప్రాంతాలతో పాటు లంగర్ హౌజ్, శంకర్ పల్లి ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు ORR ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మ‌రింత ఈజీ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. ఇది విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజేంద్రనగర్, పటాన్‌చెరు, షామీర్‌పేట్‌, ఘట్‌కేసర్, పెద్ద అంబర్‌పేట్‌కు వేగవంతమైన యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. అంతేకాకుండా కోకాపేట్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (TSPA) ఇంటర్‌ఛేంజ్‌ల మధ్య ఉన్న ఈ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్‌ని 29.50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ORRపై ఇతర ఇంటర్‌ఛేంజ్‌లను కూడా నిర్మించాలని HMDA యోచిస్తోంది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement