ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయ విద్యార్థికి గాయాలయ్యాయి. రాజధాని కీవ్‌లో ఆ విద్యార్థి గాయపడి చికిత్స పొందుతున్నట్టు కేంద్రం మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. కీవ్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్టు గుర్తు చేశారు. యుద్ధ సమయంలో బుల్లెట్ అనేది జాతీయత, ప్రాంతీయత చూడదని ఆయన వ్యాఖ్యానించారు. గాయపడిన విద్యార్థిని హర్జోత్ సింగ్‌గా గుర్తించారు. గత వారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి క్యాబ్‌లో తప్పించుకునే ప్రయత్నించాడు. ఈ సమయంలో కాల్పులు జరిగాయి. దీంతో కాలు విరిగింది. అంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీనికి ముందు అతను.. కొన్ని గంటల పాటు సాయం కోసం వేచి చూశాడు. కీవ్‌లోని సిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు హర్జోత్ సింగ్ తెలిపాడు. గాయమైన తరువాత.. స్పృహ కోల్పోయానని, కళ్లు తెరిచి చూస్తే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వివరించాడు. భారత్‌కు వెళ్లేందుకు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నట్టు తెలిపాడు.
భారత్ ఎంబసీకి సమీపంలోనే..
సరిహద్దుకు వెళ్లేందుకు కీవ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లగా.. తనను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదన్నాడు. దీంతో తన స్నేహితుడితో కలిసి క్యాబ్‌లో బయలుదేరినట్టు వివరించాడు. కీవ్ నగరం రష్యా సైనికుల చేతిలోకి వెళ్లిందని, దీంతో తన క్యాబ్‌పై కాల్పులు జరిగాయన్నారు. ఓ బుల్లెట్ తన భుజంలోకి దూసుకెళ్లిందని, స్థానికులు ఆ బుల్లెట్‌ను బయటికి తీశారన్నారు. కాలు ఫ్రాక్చర్ అయ్యిందని, మోకళ్లలో కూడా ఓ బుల్లెట్ ఉండిపోయిందని తెలిపాడు. కీవ్‌ను వదిలి సరిహద్దు వరకు వెళ్లేందుకు తనకు సాయం కావాలన్నాడు. కానీ ఎవరూ తనను సంప్రదించలేదని తెలిపాడు. ఆదివారం రాత్రే.. హర్జోత్ సింగ్ గాయపడగా.. శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారతీయ ఎంబసీకి కేవలం 20 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్నట్టు వివరించాడు. తన లాంటి ఎంతో మంది భారతీయులు కీవ్‌లోనే చిక్కుకుపోయారని ఢిల్లిdకి చెందిన హర్జోత్ సింగ్ తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..