హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అంతర్జాతీయ సంస్థలు, బహుళ జాతి కంపెనీలు తెలంగాణలో తమ వ్యాపారాన్ని విస్తరించి పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రెంచ్ కంపెనీ నాఫ్రాన్ గ్రూప్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని సంకల్పించింది. ఈ గ్రూపు తీసుకున్న నిర్ణయాన్ని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు స్వాగతించారు. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ ఎమ్మార్వో ఏర్పాటుకు నాఫ్రాన్ సంస్థ ముందుకొచ్చింది.
సుమారు 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఫ్రెంచ్ కంపెనీ నాఫ్రాన్ గ్రూప్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని కేటీ రామారావు బుధవారం ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో ఈ సంస్థ ఏర్పాటు చేసే ఎమ్మార్వో ప్రపంచంలోనే అతిపెద్దదని కేటీ రామారావు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజన్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనివల్ల దాదాపు 800 నుంచి వెయ్యి మంది వరకు ఉపాధి లభ్యమవుతాయని కేటీఆర్ వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.