Thursday, September 12, 2024

TG | ఖమ్మం – హైదరాబాద్ హైవేపై మ‌రో ఫ్లైఓవ‌ర్.. !

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI శుభవార్త అందించింది. హైదరాబాద్-విజయవాడ హైవేలో ఖమ్మం-సూర్యాపేట రహదారి కలిసే ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేలో ఖమ్మం-సూర్యాపేట హైవే కలిసే ప్రాంతంలో ఫ్లైఓవర్ లేదు. దీంతో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వారు ఈ హైవేపై వచ్చిన తర్వాత విజయవాడ వైపు దాదాపు 2 కి.మీ ప్రయాణించి యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది.

దీని కార‌ణంగా ప్రయాణికులకు దూరం పెరగడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ సమస్యను వివరిస్తూ… ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐకి లేఖ రాశారు. స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ మంజూరు చేసింది. దీంతో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. త్వరితగతిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement