హైదరాబాద్, ఆంధ్రప్రభ: పోలవరం ముంపు సమస్య మళ్లిd పొంచి ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. గత సంవత్సరం జూలైలో పోలవరం ముంపుతో భద్రాచచలం పరిసరప్రాంతాలు ముంపుకు గురైన విషాద సంఘటన మరవకముందే వర్షకాం రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైనప్పటికీ పోలవారం ప్రాజెక్టు ఉన్న ఆంధ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీడబ్ల్యూసీ, ఆదేశించినా, న్యాయస్థానం మందలించినా ఏపీ ఏమాత్రం స్పందించకపోవడంతో తిరిగి వర్షకాలంలో ముంపు తప్పదనే భావనలో అక్కడి ప్రజలు, నీటిపారుదల శాఖ ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్లుతున్నట్లు సమాచారం.
పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ సంయుక్తంగా ముంపు సర్వే చేయాలని తెలంగాణ చేస్తున్నడిమాండ్ ను ఏపీప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తెలంగాణ తీవ్రంగా స్పందిస్తోంది. మరోసారి న్యాయస్థానానికి వెళ్లి ఏపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని అంచనావేయడంతో పాటుగా తిరిగి వరదలు వస్తే జరిగేనష్టాన్ని అంచనావేస్తూ సీడబ్ల్యూసీకి ఫిర్యాదుచేయాలని తెంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే గత కొద్ది నెలల క్రితం పోలవరం ముంపు నష్టాలను అరికట్టాలని కోరుతూ ఒడిషా, ఛత్తీస్‌గఢ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సరిహద్దు రాష్ట్రాలు ఏకాభిప్రాయం సాధించాలని సూచించడంతో సీడబ్ల్యూసీ రెండుపర్యాయాలు సంబంధింత రాష్ట్రాలతోసమావేశం నిర్వహించాలని తేదీలు నిర్ణయించినా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశానికి రాకపోవడంతో ఏకాభిప్రాయం రాలేదు.
అలాగే ఉమ్మడి సర్వేకు తేదీలు నిర్ణయించినా ఆంధ్ర నీటిపారుదల శాఖ అధికారుల నుంచి కానీ, పీపీఏ నుంచి కానీ ఎలాంటిస్పందన లేకపోవడంతో వర్షాలు కురిసి వరదలు వస్తే తిరిగి తెలంగాణ భూభాగంలో పోలవరం ముంచెత్తనుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పోలవరం ముంపు సర్వే నిర్వహణను ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండటాన్ని తెలంగాణ తీవ్రంగా నిరసిస్తోంది. పోవరం నుంచి 35లక్షల క్యూసెక్కుల వరద విడుదలైతే తెలంగాణలో మునిగిపోయే గ్రామాలు దాదాపుగా వందవరకు ఉంటాయని నీటి పారుదల శాఖ అంచనావేస్తుంది. అయితే 50 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైతే నిర్వాసిత గ్రామాల సంఖ్య 250 పైగా పెరిగే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతంది. పోలవరం లో గరిష్ట స్థాయిలో నీటిని విడుదల చేస్తే దుమ్ముగూడెం ఎగువన నదిలో కలవాల్సిన 35 కు పైగావాగులు ఎగదన్నడంతో అనేక గ్రామాలు నీట మునగడంతో పాటుగా పశులకు ప్రాణ నష్టం, డ్రైనేజీ వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోందని అధికారులు అంచనావేశారు.
వరదల నివారకోసం ఏటపాక నుంచి భద్రాచలం వరకు భారీ ఎ్తతున రకకట్టలు నిర్మించాలని,ఇందుకు సంబంధించి రూ. 1, 650 కోట్లు అవసరమవుతాయని నిపుణుల కమిటీ సూచించింది. అయితే తెలంగాణ సొంత నిధులతో కొంతమేరకు అత్యవసర పనులుచేపట్టి ప్రస్తుత వర్షకాలంలో గతంలో సంభంవించిన ముంపును తగ్గించేందుకు చర్యలు చేపట్టినా కేంద్రం నుంచి కానీ, ఏపీ నుంచి కానీ ఎలాంటి సహకారం అందడంలేదు. అయితే ఈ నిధులు పోలవరం ప్రాజెక్టు
అథారిటీ సమకూర్చి ముంపును అరికట్టే బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. అయితే గత జూలై నుంచి ప్రస్తుతం జూలై వరకు సంవత్సరం పాటు ఏపీపై తెలంగాణ అనేకవిధాలుగా ఒత్తిడి తెస్తున్నా స్పందన లేకపోవడంతో తెలంగాణ తమప్రజలను కాపాడుకునేందుకు తాత్కాలిక చర్యల్లో నిమగ్నమైంది. పోలవరం ముంపు సంభవించకుండా చర్యలు తీసుకోని పక్షంలో తెలంగాణపరిధిలోని భద్రాచలం,బూర్గంపాడుతోపాటు అనేక గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంటుందని నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదికలు ఇచ్చింది. పోలవరం ముంపు పై ఒకమ్యాపును కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రాజెక్టులో 45.72 మీటర్ల దగ్గర నీటిని నిల్వ చేసినప్పుడు తీవ్రప్రభావం ఏర్పడుతుందని ఇప్పటికే నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లేవల్ ( ఎఫ్ ఆర్ ఎల్)వద్ద నీటినిల్వ చేసినప్పుడు భద్రాచలం వరకు బ్యాక్ వాటర్ 43 అడుగుల మేర నిలిచి ఉంటాయని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.
నివారణ చర్యలపై సిఫార్సులు చేసేందుకు తెలంగాణ సాగునీటి శాఖ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ ఈఎన్సీ నాగేందర్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. తాత్కాలికంగా పోలవరం ముంపును ఎదుర్కొవాలంటే 16కి.మీ. పోడవున రక్షణగోడలు, కరకట్టల నిర్మాణం చేపట్టాలనీ, ప్రస్తుతం ఉన్న కరకట్టలను మరింత పటిష్టం చేయాలని,15మైనర్, 2మీడియం, 6మేజర్ క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందనినిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. అయితే ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలవరం బ్యాక్ వాటర్ తో ప్రమాదం పొంచి ఉన్న గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు.