Friday, November 22, 2024

Taiwan : మ‌రోసారి భూకంపం… 24గంట‌ల్లో 80సార్లు

తూర్పు ఆసియా దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోతుంది. సోమ‌వారం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించినట్లు పేర్కొన్నారు. తైవాన్ తూర్పు తీరంలో అత్యధికంగా రికార్ట్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదైంది.

- Advertisement -

ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బ తిన్నాయని తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంపాలు సంబవించినట్లు గుర్తించారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు.

ఇక, అలాగే, ఏప్రిల్ 3వ తేదీన కూడా తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయారు. అప్పటి నుంచి తైవాన్ లో వరుస భూప్రకంపనలు వస్తున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన ఏర్పడిన భూకంపంతో హువాలియన్‌లో కొద్దిగా వంగిన ఓ హోటల్ తాజా భూకంపం ప్రభావంతో పూర్తిగా ధ్వంసమైంది.. అది వినియోగించడానికి రాదని అగ్నిమాపక విభాగం మంగళవారం తెల్లవారుజామున తెలియజేసింది. భూకంపాలకు అధిక అవకాశం ఉండే రెండు ‘టెక్టోనిక్ ప్లేట్స్’ జంక్షన్‌కు సమీపంలో తైవాన్ ఉంది. అందుకే, ఆ దేశంలో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement