హైదరాబాద్, ఆధ్రప్రభ బ్యూరో : మానవాళికి హెచ్చరికలు చేస్తూ.. కరోనా జాతికి చెందిన మరో వైరస్ ముంచుకొస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఈ వ్యాధిని ఫ్రాన్స్‌లో కనుగొన్నప్పటికీ అధిక జన సాంద్రత గల అనేక దేశాల్లో విస్తరించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) లోని వైద్య విభాగం హెచ్చరిస్తోంది. సాధారణ జ్వరం, జలుబు, గొంతుపొప్పితో మొదలయ్యే ఈ వ్యాధి సోకే అవకాశాలున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వ్యాధి ముదిరితే కళ్ళల్లోంచి కర్తస్రావం వస్తుందని, అది నియంత్రన కోల్పోయిన స్థాయిగా పరిగణించాల్సి ఉంటుందని వైద్య రంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ప్రతిఒక్కరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ కరోనా లాంటి వైరస్‌లతో ప్రపంచం వణికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ పెట్టిన ఇబ్బంది మరువక ముందే మరో వైరస్ కలకలం రేపుతోంది.
ఫ్రాన్స్‌లో కళ్ల నుండి రక్తస్రావం జరిగే వైరల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది. ఇది ఒకరకమైన పురుగుల ద్వారా వ్యాప్తిస్తుందని వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దుల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమై.. ఈ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సంచరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తమ దేశ పౌరులకు సూచించింది.
కళ్లలో రక్తస్రావం కలిగిస్తోన్న ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధి పేరు ‘క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్’ అని వైద్యనిపుణులు తెలిపారు. ఇది ఒక రకం పురుగుల ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. బాధితుల్లో కండరాల నొప్పి, గొంతులో మంట, వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ముక్కు, కళ్లు, చర్మంలోని రక్తనాళాలు పగిలి, వాటి నుంచి రక్తస్రావం జరుగుతుండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. జ్వరం, కళ్లు తిరగడం, మెడ, వెన్ను, తలనొప్పి, కళ్లు ఎర్రబారడం, వెలుగును చూడలేకపోవడం వంటిని కనిపిస్తున్నాయి. వ్యాధి ముదిరేకొద్ది ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతున్నాయని వైద్యులు అప్రమత్తం చేశారు.
ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తగా ఉండాలని పౌరులను ఫ్రాన్స్ తదితర దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. కాగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వ్యాధి ఎబోలా వైరస్‌కు సంబంధించినదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుందని తెలిపారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది తొలి ప్రాధాన్య వ్యాధుల్లో దీనిని కూడా చేర్చుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఇది ఎబోలా జాతి వైరస్.. ప్రాణాంతకమే..?
క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే ఎబోలా జాతి వైరస్‌కు సంబంధించిన వ్యాధి. ఆఫ్రికా, పశ్చిమాసియాతో పాటూ ఐరోపా దేశాల్లో అధికంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఒక్కో సారి స్పెయిన్ లో కూడా కనిపిస్తూ ఉంటు-ంది. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి , ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.
ప్రస్తుతం ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దుల్లో ఉన్న ఈ వైరస్ రానున రోజుల్లో బ్రిటన్ కు కూడా వ్యాప్తి చెందవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత దృష్ట్యా ఈ ఏడాదికి సంబంధించిన తీవ్ర వ్యాధుల జాబితాలో చేర్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ వైరస్ హయలోమా మార్గినాటమ్ అనే పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు శాసత్త్రవేత్తలు వ్యాధి సోకిన వారి శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలివీ..
ఈ వ్యాధి సోకిన వారిలో ముందుగా ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. ముందుగా కండరాల నొప్పులు, గొంతు, తల నొప్పి, వాంతులు, కడుపు మంటతో పాటూ నొప్పి ఉంటు-ంది. ఈ వ్యాధి ముదిరేకొద్దీ లక్షణాలు తీవ్ర రూపం దాలుస్తాయి. ముక్కు, కళ్లు, చర్మంలోని రక్తనాళాలు పగిలి వాటి నుంచి రక్తస్రావం జరుగవచ్చు. జ్వరం, కళ్లు తిరగడం, మెడ, వెన్ను నోప్పి తీవ్రంగా ఉంటుంది.
చివరి దశలో కళ్లు ఎర్రగా మారడం, చిన్న పాటి వెలుగును కూడా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. రోగి శరీరంలోని రోగనిరోధక శక్తి ద్వారానే వ్యాధితో పోరాడి చికిత్స అందించే విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి బారిన పడిన బాధితుల్లో 10 నుంచి 40 శాతం మంది మాత్రమే చనిపోయినట్లు తెలిసింది.