Monday, November 18, 2024

కొత్త కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై మరో వివాదం.. న్యాయ మరోపారాటానికి సిద్ధం: తెలంగాణ నీటిపారుదల శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణానదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన కేంద్రం మరో కొత్త వివాదానికి తెరతీసింది. కొత్తట్రిబ్యునల్‌ ఏర్పాటుచేసి కృష్ణా నదీ వాటా తేల్చాలని తెలంగాణ ప్రభుత్వం 2014నుంచి ఆందోళనచేస్తున్నా స్పందించని కేంద్రం కొత్తట్రిబ్యునల్‌ పై కీలక పరిణామాన్ని తెరపైకి తెచ్చింది. నదీజలాల వాటాలను తేల్చేందుకు సిద్ధంగా లేనట్లు వ్యవహరిస్తూ కొత్తట్రిబ్యునల్‌ ఏర్పాటుపై అటార్నీ జనరల్‌ వెంకట రమణీ స్పష్టత ఇవ్వలేదు. కొత్త ట్రిబ్యునల్‌ పై గతంలో ఏజీ అభిప్రాయాన్ని కేంద్రం కోరినట్లు ఆయన గుర్తుచేశారు. అయితే తాను అటార్నీ జనరల్‌ గా బాధ్యతలు స్వీకరించేముందు సీనియర్‌ న్యాయవాదిగా ఏపీ పక్షాన ఆనేక కేసులు వాదించినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తాను కొత్తట్రిబ్యునల్‌ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు చెప్పారు. దీంతో కేంద్ర జలశక్తి కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు అంశం ఫైల్‌ను సోలిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా కు పంపింపించింది.

రాష్ట్ర విభజన అనంతరం తెలుగురాష్ట్రాల మధ్య కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తుంది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును నోటిపై చేసి నదీజలాల పంపకాల్లో జోక్యంచేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఫిటీషన్‌ ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసకుంటామని కేంద్రం పలుమార్లు పేర్కొంది. కేంద్ర జలశక్తి హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ఫిటిషన్‌ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నేఫథ్యంలో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు కంటే ఉన్నట్రిబ్యునల్‌ తోనే నదీ జలాల సమస్యపరిష్కరిస్తామని అటార్నీజనరల్‌ గతంలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.

ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని కోరగా తాను నిర్ణయం తీసుకోలేనని స్పష్టత చేయడంతో తెలంగాణ మండిపడుతుంది. ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని వివరిస్తూ దస్త్రాన్ని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతాకు కేంద్రం పంపింపించింది. తుషార్‌ మోహతా నిర్ణయం కీలకంగా మారనుంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణకు నదీజలాల్లో న్యాయమైన వాటా కావాలని ఇప్పటికే కృష్ణానదీ జలాల యాజమాన్యం బోర్డు ముందు తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతమైన వాదనలు వినిపించింది. బోర్డు జాప్యం చేస్తే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించింది. తెలంగాణకు 299టిఎంసీలు. ఆంధ్రకు 512 టీఎంసీల నీటివాటాను అంగీకార యోగ్యం కాదని కనీసం 50 శాతం వాటాను తెలంగాణకుకేటాయించాలని నీటిపారుదల శాఖ డిమాండ్‌ చేసింది.

న్యాయ మరోపారాటానికి సిద్ధం..

- Advertisement -

కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటాకోసం న్యాయపోరాటానికి మరోసారి సిద్ధం అవుతున్నట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ కేంద్రాన్ని హెచ్చరించింది. కెఆర్‌ఎంబీ సమావేశాల్లో ఈ మేరకు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. అలాగే సీడబ్ల్యూసీ లో తెలంగాణకు చెందాల్సిన కృష్ణా నదీ జలాలను ఏపీ దోచుకుపోతుందని సాక్ష్యాలతో నిరూపించినా కెఆర్‌ఎంబీ స్పందన లేదని విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కేంద్ర జలశక్తి స్పందించని పక్షంలో పాలమూరు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఐందోళన వ్యక్తంచేసింది. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టు నుంచి ఫిటీషన్‌ ను ఉపసంహరించుకున్నా న్యాయం జరగలేదని వాపోయింది. ఇప్పటికైనా కేంద్రం స్పందించి కృష్టానదీ జలాల వాటా తేల్చాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసినా కేంద్రం ఎందుకు స్పందించడంలేదని తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ ప్రశ్నిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement