మరో వివాదంలో చిక్కుకున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వారసుడు.హీరో విజయ్ కి వున్న రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. దిల్ రాజు తమిళ్ నాడు పోతే ఇది తమిళ సినిమా అని తెలుగుకు వస్తే ఇది తెలుగు సినిమా అని పాట పడుతున్నాడు. దీనితో వారసుడు కు థియేటర్స్ ఇవ్వొదని తెలుగు నిర్మాతలు నోటీస్ పంపారు.
తాజాగా మరో ప్రాబ్లెమ్ ఎదురు అయ్యింది.ఈ సినిమాలో పర్మిషన్ లేకుండా జంతువులను వాడినందుకు జంతు పరిరక్షణ సమితి కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది. వారిసు సినిమాలో ఒక సీన్ లో ఎలిఫెంట్ ను ఉపయోగించారట. జంతు పరిరక్షణ సమితి వారు పర్మిషన్ లేకుండా షూటింగ్ చేశారని, వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం నోటీసులు పంపారట. దీనితో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు అయ్యింది పరిస్థితి. ఇక ఈ సమస్యల నుంచి బయటపడటానికి దిల్ రాజు ఏమి చేస్తాడో చూడాలి.