హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారీ వర్షాల కారణంగా కళాశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో… ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షా ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. రూ.200 లేట్ ఫీజుతో ఈ నెల 18 నుంచి 19 తేదీల్లో ఫీజును ఆయా కళాశాలల్లో చెల్లించాలని విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు విద్యార్థుల నుంచి లేట్ ఫీజుతో పరీక్షా ఫీజును తీసుకోవాలని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ శుక్రవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నుంచి తీసుకున్న పరీక్షా ఫీజును ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో జమ చేయాలని ఆదేశించింది. ఈ నెల 19న సాయంత్రం 5 గంటల కల్లా ఫీజును జమ చేయాలని, ఈ విషయంలో జాప్యం చేయకూడదని ఆదేశించారు.