Saturday, July 6, 2024

Bihar | బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో 7కి చేరిన సంఖ్య

బీహార్‌లో మరో బ్రిడ్జి కూలిపోయింది. బీహార్‌లోని సివాన్ జిల్లాలో గండకి నదిపై వంతెన కూలిపోవడంతో 15 రోజుల వ్యవధిలో ఏడవ ఘటన చోటు చేసుకుంది. డియోరియా బ్లాక్‌లో ఉన్న ఈ చిన్న వంతెన అనేక గ్రామాలను మహరాజ్‌గంజ్‌తో కలుపుతుంది.

డియోరియా బ్లాక్‌లోని వంతెన మరమ్మతుల్లో ఉందని డిప్యూటీ డెవలప్‌మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. భారీ వర్షాలు, నదుల ఉప్పెన కారణంగా బ్రిడ్జిలు కూలుతున్నాయని ముఖేష్ కుమార్ తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. వంతెన 1982-83లో నిర్మించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయని కుమార్ తెలిపారు. ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ వంటి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై దర్యాప్తు చేయడానికి బీహార్ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దీనిపై విచారణ జరుపుతోందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement