రష్యా మరోసారి ఉక్రెయిన్నుంచి గట్టి దెబ్బ తగిలింది. నల్లసముద్రంలో మోహరించిన మాస్కోవాపై నెప్య్టూన్తో దాడి చేసి మునిగిపోయేలా చేసిన ఉక్రెయిన్ ఆ తర్వాత మరో రెండు నౌకలను ధంసం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే పని చేసి రష్యాను నివ్వెరపరచింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన తొలినాళ్లలోనే సాధీనం చేసుకున్న చిన్నపాటి స్నేక్ ఐలాండ్‌లో రష్యా మోహరిస్తున్న నేపథ్యంలో పదేపదే దాడి చేస్తూ చికాకు పుట్టిస్తోంది. తాజాగా గురువారం పొద్దుపోయాక రష్యాకు చెందిన వెస్వలోడ్ బోబ్రోవ్ నౌకను ధంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. మంటలు అంటుకున్న నౌకలో ఎక్కువ భాగం దెబ్బతిందని పేర్కొంది. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌ను స్నేక్ ఐలాండ్‌కు తరలిస్తున్న నౌకపై దాడి చేశామని వెల్లడించింది. అయితే రష్యా ఇ ంతవరకు దీనిపై స్పందించలేదు. నల్లసముద్రంలోని స్నేక్ఐలాండ్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం. అందుకే యుద్ధం ప్రారంభమైన వెంటనే రష్యా సాధీనం చేసుకుంది. ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు, నల్లసముద్రంలో పట్టు సాధించేందుకు అక్కడ రష్యా సైనిక మోహరింపులు చేస్తోంది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ ఇప్పటివరకు మూడు నౌకలను అదే ప్రాంతంలో దెబ్బతీసింది. కాగా రష్యా స్వాధీనంలో ఉ న్న ఖార్కీవ్ ప్రాంతంలో ఉక్రెయిన్ మళ్లిd పట్టు సాధిస్తోంది. ఖార్కీవ్‌కు 40 కి.మి. దూరంలోని సివెల్సిడియ డోనెట్స్ నదిలో పట్టు కోసం రష్యా బలగాలు చేస్తున్న ప్రయత్నాలును ఉక్రెయిన్ సేనలు తిప్పికొట్టాయి. అక్కడ బ్రిడ్జిని ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్ ధాటికి రష్యా సేనలు వెనక్కు వెళ్లక తప్పలేదు.
రష్యాకు మరో దెబ్బ, స్నేక్ ఐలాండ్‌లో నౌకపై ఉక్రెయిన్ దాడి.. ఖార్కీవ్లో రష్యా బలగాలు వెనక్కి
Advertisement
తాజా వార్తలు
Advertisement