Friday, November 22, 2024

Delhi: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్‌ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇవాళ‌ ఉదయం కొట్టేసింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్‌. లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి.. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఆయన్ని లాయర్ కలిసేందుకు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్ ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరిన కేజ్రీవాల్‌ కోరారు.

అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ.. కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉంటే తన అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్‌ అరెస్టును సమర్థించిన కోర్టు.. సామాన్యులకు, సీఎంలకు న్యాయం ఒక్కోలా పని చేయదంటూ వ్యాఖ్యానించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement