కర్ణాటకలో మరో బ్యాంకు దోపిడీ ఘటన చోటుచేసుకుంది. ఉల్లాల్ సమీపంలోని కెసి రోడ్ బ్రాంచ్‌లోని కోటేకర్ వ్యవసాయ సహకార బ్యాంకులో శుక్రవారం మధ్యాహ్నం ఆరుగురు సాయుధ దుండగులు చోరీకి పాల్పడ్డారు.
బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.15 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు దోచుకుని కారులో పరారైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు.. విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు.
- Advertisement -
కాగా, కర్ణాటకలోని బీదర్ లో నిన్న (గురువారం) దొంగలు భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనంపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు మృతి చెందగా, ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.