Friday, November 22, 2024

వ‌న్‌ప్ల‌స్ నుంచి మ‌రో అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వ‌న్‌ప్ల‌స్ ఏస్‌-2 ప్రొ రిలీజ్‌!

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ‌ వన్‌ప్లస్.. త‌మ బ్రాండ్ నుంచి మ‌రో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. వ‌న్ ప్ల‌స్ ఏస్ 2 ప్రో అనే ఫోన్ ని ఇటీవ‌లే చైనాలో లాంచ్ చేసింది. కాగా ఈ ఫోన్ వేరియంట్లు ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. 6.74 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఏకంగా 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ను వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో సపోర్ట్ చేయనుంది.

వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో ధర..

బేస్ మోడల్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా (సుమారు రూ.34,600)
16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,399 యువాన్లుగానూ (సుమారు రూ.39,200)
24 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగానూ (సుమారు రూ.46,100) ఉంది. అరోరా గ్రీన్, టైటానియం యాష్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మరి భార‌త్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తార‌నే విష‌యాన్ని కంపెనీ ఇంకా తెలియ‌జేయ‌లేదు.

- Advertisement -

వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే తయారీలో రెయిన్ వాటర్ టచ్ టెక్నాలజీని ఉపయోగించామని, వర్షంలో కూడా దీన్ని ఉపయోగించడానిక ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.3, డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా అందించారు. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 210 గ్రాములుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement