Tuesday, November 19, 2024

Railway | ఈ ఏడాది చివరికల్లా మరో 1000 జనరల్‌ కోచ్‌లు

సాధారణ తరగతి ప్రయాణీకుల సౌకర్యాల విస్తరణకు రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈఏడాది చివరి నాటికి దాదాపు 370 సాధారణ రైళ్లకు జనరల్‌ కేటగిరీకి చెందిన 1000కి పైగా కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త జనరల్‌ కేటగిరీ కోచ్‌లను అమర్చడం ద్వారా రోజుకు సుమారు లక్ష మంది అదనపు ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారు.

రానున్న రెండేళ్లలో రైల్వేలో పెద్ద సంఖ్యలో నాన్‌-ఏసీ క్లాస్‌ కోచ్‌లను చేర్చే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ) దిలీప్‌ కుమార్‌ తెలిపారు.

ప్రస్తుతం కొత్త జీఎస్‌ కోచ్‌ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రానున్న రెండేళ్లలో ఈ తరహా నాన్‌ఏసీ జనరల్‌ క్లాస్‌ కోచ్‌లు అదనంగా 10వేలకు పైగా రైల్వేలో చేరనున్నాయి. వీటిలో ఆరు వేలకు పైగా జీ.ఎస్‌. కోచ్‌లు కాగా, మిగిలిన కోచ్‌లు స్లీపర్‌ క్లాస్‌కు చెందినవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement