Thursday, January 2, 2025

Annual Report – అవినీతిలో పోలీస్ శాఖ ఫస్ట్, రెవెన్యూ శాఖ సెకండ్ ..

హైదరాబాద్ – 2024లో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న 170 మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి పోయారు. ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది. అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది

ఈ ఏడాది లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగుల వివరాలు శాఖల వారీగా..

పోలీసు శాఖ: కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు 31 మంది లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

రెవెన్యూ శాఖ : 19 అధికారులు..రిజిస్ట్రేషన్ శాఖ : 13 అధికారులు..

- Advertisement -

మున్సిపల్ , 12,పంచాయత్ రాజ్ శాఖలు : 12 మంది అధికారులు..

ఈ ఏడాది ప్రధాన కేసులు:

కుషాయిగూడకు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఓ కేసును క్లోజ్ చేసేందుకు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డారు.

అలాగే.. హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రూ. 3 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటూ.. ఏసీబీ అధికారులు చేతికి చిక్కాడు. అప్పటికే రూ. 5 లక్షలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సంగారెడ్డి ఇన్‌స్పెక్టర్ ఓ కేసులో రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడు. ముందుగా రూ. 5 లక్షలు పుచ్చుకుంటుండగా.. అడ్డంగా దొరికి పోయాడు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు..ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ చర్యలు తీసుకుంది. అతని వద్ద 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, బ్రాండెడ్ వాచ్‌లు, ఐఫోన్‌లు వంటి విలాసవంతమైన వస్తువులతో సహా రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది.

నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వద్ద రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. హైదరాబాద్ సీపీఎస్‌ ఏసీపీ వద్ద రూ. 3.95 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి చర్యలు తీసుకుంది.

శామీర్‌పేట తహశీల్దార్ రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసి.. రూ.10 లక్షలు నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు

నేరారోపణలు:

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏసీబీ నిందితులుగా తేల్చిన 170 మంది ప్రభుత్వ అధికారుల్లో 12 మంది దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి 1-4 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement