హైదరాబాద్ – నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు జరగనున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు సర్వం సిద్ధమైంది. తెలుగు భాష ప్రాముఖ్యం, సంస్కృతి విశేషాలతో పాటు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
కాగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలో చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతోపాటు బిజినెస్ రంగానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ మహాసభలకు సినిమారంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, జయప్రద, మురళీ మోహన్ తదితరులు రానున్నారు.