Monday, November 25, 2024

మినీ మేడారం జాత‌ర తేదీల ప్ర‌క‌ట‌న‌.. వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకునేందుకు త‌ర‌లిరానున్న భ‌క్తులు

ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర రెండేళ్లకొకసారి జరుగుతుంది. జాతర సమయంలో వన దేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే.. మధ్యలో మినీ మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. వచ్చే ఏడాది జరిగే మేడారం మినీ జాతర తేదీలను సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం తాజాగా ప్రకటించింది.

- Advertisement -

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగ నిర్వహించ‌నున్నారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ‌ద్దె, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క – సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార‌లు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక‌.. ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహా జాతర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement