ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను మరో మారు ప్రస్తుత ప్రధాని మీద ఘాటుగా విమర్శలు చేశారు. ఆరు రోజుల్లో ఎన్నికలపై ప్రకటన చేయండి. లేదంటే మొత్తం దేశంతో కలిసి ఇస్లామాబాద్‌కు తిరిగి వస్తా అని హెచ్చరించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, దేశ రాజధానిలో నిరసనకారులనుద్దేశించి ప్రసంగించారు. నిరసన కారులు మార్చ్‌ను ఆపేందుకు ప్రభుత్వం చేపడుతోన్న అరెస్ట్‌లు, సోదాలను ఇమ్రాన్ ఖండించారు. ప్రభుత్వం అనుసరిస్త్తున్న వ్యూహాలపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను సుప్రీం కోర్టు విచారణకు తీసుకోవడంపై ఆయన కృతజ్ఞతలు వ్యక్తం చేశారని డాన్ వార్తాసంస్థ పేర్కొంది.
కొద్ది వారాల క్రితం ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యాడు. మెజార్టీ కోల్పోవడం వల్ల ఆయన అధికారంలో లేకుండాపోయాడు. ఆయన స్థానంలో పీఎంఎల్ (ఎన్) పార్టీకి చెందిన షహబాజ్ షరీఫ్ ఆ పదవిని చేపట్టారు. ఈ ప్రభుత్వానికి చట్టబద్దత లేదని, అందువల్ల మళ్లిd ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇస్లామాబాద్‌లోని డీ చౌక్ వద్ద శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనికి సుప్రీం కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అయితే వేల సంఖ్యలో వచ్చిన నిరసన కారులు బారికేడ్లు తొలగించడంలో వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. నిరసన కారులపై లాఠీచార్జి జరిగినట్టుగా అక్కడి మీడియాలో ప్రసారం అయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..