Friday, November 22, 2024

అమ్మానాన్న మీద కోపం.. గోతిలోనే బతికేస్తున్న యువకుడు

కొంత వయసు రాగానే పిల్లలు అమ్మానాన్నలతో గొడవలు పడటం మామూలే. అయితే చాలా మంది ఆ గొడవను కాసేపటికే మర్చిపోయి మామూలు అయిపోతారు. కానీ స్సెయిన్‌కు చెందిన ఆండ్రెస్ కాంటో అనే కుర్రాడు అలాంటోడు కాదు. 14 ఏళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రులతో పడిన గొడవ గుర్తుపెట్టుకున్న ఆండ్రెస్.. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయింది ఎక్కడికో కాదు.. పెరట్లోకి. ఇక్కడే ఉందో ట్విస్ట్. ఆండ్రెస్ తమ ఇంటి పెరట్లో ఒక గుహ తవ్వుకున్నాడు. 2012లో తల్లిదండ్రులు తనను తిట్టిన కోపాన్ని మనసులో పెట్టుకొని పెరట్లో గుంత తవ్వడం ప్రారంభించాడు.

స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఖాళీ సమయం దొరికితే ఇక అదే పనిలో ఉండిపోయాడు ఆండ్రెస్. స్నేహితుడు తెచ్చిన డ్రిల్ మిషన్‌తో పని మరింత సులువైంది. ఇలా ఈ ఇద్దరు పిల్లలు కొన్ని వారాలు కష్టపడి మూడు మీటర్ల లోతైన గుంత తవ్వారు. అందులో ఇంటర్నెట్, బాత్‌రూం, సిట్టింగ్ రూం సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆండ్రెస్ ఆ గుంతలోనే ఉంటున్నారు.

దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయమై ఆండ్రెస్ మాట్లాడుతూ.. ‘ట్రాక్‌సూట్‌లో ఊర్లో చక్కర్లు కొడుతుంటే మా అమ్మానాన్న తిట్టారు. కానీ నాకు అలా తిరగడమే ఇష్టం. అప్పుడే గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ గుంత తవ్వుకొని ఉంటున్నా. నా జాగ్రత్తలు నేను చూసుకుంటా.. మీరేమీ భయపడొద్దు అని అమ్మానాన్నకు చెప్పా’ అని అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement