Tuesday, November 26, 2024

లాక్‌డౌన్‌ డౌన్‌.. చైనాలో కొవిడ్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా ఆగ్రహం.. షాంఘై, జిన్‌జియాంగ్‌ రాష్ట్రాల్లో అల్లర్లు

కొవిడ్‌ ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. షింజియాంగ్‌ ప్రావిన్సు రాజధాని ఉరుమ్‌కీలోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. దాంతో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున బలగాల్ని మోహరించింది. ఆందోళన కారుల్ని చెదగొట్టేందుకు బాష్పవాయువు, పెప్పర్‌ స్ప్రే వంటి చర్యలు చేపట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా, అగ్నిప్రమాద సమయంలో ప్రజలు వెంటనే బయటకు రాలేక పోయారని నిరసనకారులు ఆరోపించారు. చివరకు శ్వాస తీసుకోలేక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు.

సాంఘైలో జరిగిన నిరసనల్లో దాదాపు 300 మంది పాల్గొన్నారు. షీజిన్‌పింగ్‌ స్టెప్‌డౌన్‌.. కమ్యూనిస్టు పార్టీ స్టెప్‌డౌన్‌.. అన్‌లాక్‌ షింజియాంగ్‌.. అన్‌లాక్‌ చైనా..డునాట్‌ వాంట్‌ పీసీఆర్‌ టెస్ట్‌ అని నినదిస్తూ నిరసన వ్యక్తం చేసారు. మరోవైపు ఆందోళనలకు సంబంధించిన పోస్టులను సామాజికమాధ్యమాల నుంచి ప్రభుత్వం తొలగించి వేస్తోంది. షింజియాంగ్‌లో మూడు నెలలుగా కఠిన లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో ఉరుమ్‌కీలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల నంచి ప్రభుత్వం పాక్షిక మినహాయింపుల్ని ఇచ్చింది. సోమవారం నుంచి రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తామని తెలిపింది.

కాగా, చైనాలో రోజుకు సగటున 40వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నట్లు అనధికార సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కనుమరుగు అవుతున్న క్రమంలో, చైనాలో కేసులు విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కొవిడ్‌ విధానం అక్కడి ప్రజలకు విసుగు పుట్టించింది. కొన్నినెలల కిందటే షాంఘైలో దాదాపు 25 లక్షల మందిని లాక్‌డౌన్‌లో ఉంచారు. అప్పటి నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. క్రమంగా మిగతా రాష్ట్రాలకూ విస్తరిస్తున్నాయి.

- Advertisement -

దేశవ్యాప్తగా ఆగ్రహం..

ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మ#హమ్మారి ప్రారంభ వారాల నుండి వచ్చే కొన్ని వారాలు చైనా యొక్క చెత్తగా ఉండవచ్చని క్యాపిటల్‌ ఎకనామిక్స్‌కు చెందిన మార్క్‌ విలియమ్స్‌ గత వారం నోట్‌లో తెలిపారు. వాయువ్య నగరమైన లాన్‌జౌలో, నివాసితులు శనివారం కోవిడ్‌ సిబ్బంది గుడారాలను కూల్చివేసి ధ్వంసం చేశారు. టెస్టింగ్‌ బూత్‌లు, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చూపించారు. ఎవరూ పాజిటివ్‌గా నిర్ధారణ కానప్పటికీ తమను లాక్‌డౌన్‌లో ఉంచినట్లు నిరసనకారులు తెలిపారు. ఉరుంకి బాధితుల కోసం నాన్‌జింగ్‌ మరియు బీజింగ్‌తో సహా నగరాల్లోని విశ్వవిద్యాలయాలలో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి.

covi
Advertisement

తాజా వార్తలు

Advertisement