Tuesday, November 26, 2024

ఆడ్రాయిడ్‌ సృష్టికర్త బాబ్‌లీ దారుణ హత్య

ఆడ్రాయిడ్‌ సృష్టికర్త, ప్రముఖ మొబైల్‌ పేమెంట్‌ సర్వీస్‌ ‘క్యాష్‌ యాప్‌’ ఫౌండర్‌ బాబ్‌లీ దారుణ హత్యకు గురయ్యారు. .శాన్‌ ఫ్రాన్సిస్కోలో గుర్తు తెలియని దుండగులు బాబ్‌లీపై కత్తితో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని ఆస్పత్రికి తరలించే లోపే మరణించినట్లు శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు తెలిపారు.బాబ్‌లిని కత్తులతో దాడికి పాల్పడ్డారంటూ మంగళవారం ఉదయం 2.35 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మెయిన్‌ 300 బ్లాక్‌ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న బాబ్‌లీని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవ శాత్తూ మార్గం మద్యంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు.

బాబ్‌లీ గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ తయారీలో ముఖ్యపాత్ర పోషించాడు. టెక్‌ వరల్డ్‌లో ‘క్రేజీ బాబ్‌’గా పేరొందిన బాబ్‌లీ ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్సేతో కలిసి పనిచేశారు. జాక్‌ డోర్సే ఫౌండర్‌గా ‘స‍్కైర్’ అనే సంస్థను స్థాపించారు. 2010లో ఆ సంస్థ సీటీవోగా, ఆ తర్వాత క్యాష్‌ యాప్‌ ఫౌండర్‌గా ఇలా ఫిన్‌ టెక్‌, టెక్నాలజీ రంగాల్లో విశేషంగా రాణించారు. ఇప్పుడు బాబ్‌లీ దారుణ హత్యకు గురికావడం టెక్‌ రంగాన్ని విస్మయానికి గురి చేస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement