Saturday, November 23, 2024

ఏపీలో విజృంభిస్తోన్న క‌రోనా..24గంట‌ల్లో 385కేసులు..

క‌రోనా ముప్పు ఇప్ప‌ట్లో త‌ప్పేలా లేదు..థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు..ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. కాగా ఏపీలో గడచిన 24 గంటల్లో 39,848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 87 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 64, కృష్ణా జిల్లాలో 46, పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి.

అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 4 కేసులు గుర్తించారు.అదే సమయంలో 675 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,66,450 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,47,722 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,355 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,373కి పెరిగింది. మాస్క్ ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని చెబుతున్నా ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యారు..ఇక శానిటైజ‌ర్ల వినియోగం త‌గ్గింద‌నే చెప్పాలి. ఈ మేర‌కు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు వైద్యులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement