ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వగానే జగన్ సర్కారు దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగించిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌నూ టార్గెట్ చేయబోతోంది. గతంలో మంత్రి పెద్దిరెడ్డి తనను ఎస్ఈసీ నిమ్మగడ్డ అవమానించారంటూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తాజాగా దీనిపై చైర్మన్ కాకాణి గోవర్ధన్ ఆద్వర్యంలో జూమ్ కాల్ ద్వారా భేటీ కాబోతున్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందున్న ఈ అంశంపై నిమ్మగడ్డకు నోటీసులిచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6గంటలకు ఈ భేటీ జరగబోతుంది. మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఎస్ఈసీ సీరియస్‌గా స్పందించింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement