Saturday, November 23, 2024

ఏపీలో స్కూల్స్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ లో కూడా పాఠశాలలు మూసి వేస్తారా లేదా అనే ఈ విషయం పై అందరిలోను ఓ ప్రశ్న మొదలైంది. కాగా ఇదే విషయమై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు ,కాలేజీలు మూసే ఉద్దేశమే లేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతానికి స్కూళ్లకు సెలవులు ఇచ్చే పరిస్థితి లేదని ఆన్ లైన్ లో విద్యాబోధన ప్రశక్తే లేదని ఆయన అన్నారు. కరోనా నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు . ఇక ఏప్రిల్ 1 నుంచి ఒంటి పూట బదులు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement