Thursday, November 14, 2024

AndhraPrabha Exclusive – చెరువే క‌ల్ప త‌రువు..

హైదరాబాద్‌ పచ్చగా కళకళలాడాలంటే చెరువులు కల్పతరువులుగా మారాలి. కాలుష్య తటాకాలను మంచినీటి వనరులుగా మార్చాలి. పూర్వపు రోజుల్లో మాదిరిగా నీటి ప్రవాహం వచ్చి, ఒక చెరువు నుంచి మరో చెరువుకు సాఫీగా చేరాలి. కాలుష్యం లేని అందమైన, సురక్షితమైన, పర్యావరణహిత ప్రాంతాలుగా వాటిని అభివృద్ధి చేయాలి. చుట్టూ మొక్కలు నాటాలి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి నయా రూపం తేవాలి. బెంగళూరు మోడల్‌ను చూశారుకదా! ఇక్కడా అమలు చేయండి. నిధుల సమస్య రానివ్వను. పుష్కలంగా ఇస్తా. అండగా ఉంటా.. దూసుకుపోండి.. ఒకప్పటి లేక్‌సిటీ.. కొత్త కళతో రూపుదిద్దుకుంటే.. ప్రపంచం మనవైపు చూసి పరవశించిపోవాలి.. ఇక్కడకు వచ్చి సేదదీరాలి. మనది రాజకీయ దృక్పథం కాదు.. అభివృద్ధి లక్ష్యం. ఆ దిశగా దూసుకుపోండి…

మళ్లీ లేక్ సిటీగా హైదరాబాద్‌
భాగ్యనగరానికి జలతోరణం
సమృద్ధిగా జలాలు.. చుట్టూ పచ్చని చెట్లు.. మంచి గాలి
కాలుష్య రహిత ప్రాంతాలుగా అభివద్ధి
అలా చెరువుల పునరుద్ధరణ
బెంగళూరులో సరికొత్త విధానాలు
ఆ వెూడల్‌ ఇక్కడా అమలు
హైడ్రా బృందం అధ్యయనం
ఆక్రమణల తొలగింపు ఓ భాగం
రంగంలోకి హైడ్రా కమిటీలు
కాలుష్య నియంత్రణ నిపుణులకు చోటివ్వాలి
అండగా నేను.. దండిగా నిధులు
హైడ్రా టీమ్‌కు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో అంతర్థాన మైన అన్ని చెరువులను పునరుద్ధరించడం సాధ్యం కాక పోయినా, ఇప్పటికి మిగిలిన చెరువులు, కుంటలను కాపా డుకోవడంపై , పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. ముందుగా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో ఆక్రమణలు తొలగించి, వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నది. నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూస్తున్నది.

కర్నాటక రాజధాని బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతమైంది. ఉద్యానవన నగరంగా పేరుపొందిన బెంగళూరుకు చెరువులు తలమానికంగా నిలిచాయి. ఆ నగరంతో పోలిస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో తటాకాలు ఎక్కు వ. నైసర్గికంగా కూడా అనువైన వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో అమలు చేసిన విధానాలను పరిశీలించేందుకు ఇటీవల హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ నేతృ త్వంలోని బృందం అక్కడ పర్యటించింది. నిపుణులతో సమావేశమైంది.

ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హైడ్రా టీమ్‌తో ప్రత్యేకంగా చర్చించారు. చెరువుల పునరుద్ధరణ వెనుక ప్రభుత్వానికి రాజకీయ లక్ష్యాలేమీ లేవని, భవిష్యత్‌ నగరంగా హైదరాబాద్‌ని అభివృద్ధిని చేయడంకోసమే నిర్ణయం తీసుకున్నామని, అందువల్ల అధికారులు నిర్భ యంగా ముందుకు వెళ్లాలని ప్రోత్సహించారు. చెరువుల సుందరీకరణ, చుట్టూ గ్రీనరీ, మంచిగాలి ఉండేలా, నీళ్లు స్వచ్ఛంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. నిధుల కొరత ఉండదని, ఎంతైనా ఖర్చు చేసేందు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. హైదరా బాద్‌ నగరానికి మన చెరువులు కొత్త ఆభరణాలుగా మారా లని సూచించారు. ప్రపంచం ఇటు చూసి.. ఇక్కడకు వచ్చి సేదదీరేలా వాటిని తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.

విప క్షాలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి చెరువుల ప్రాణాలు తీసేశాయని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలా చేయబోదని స్పష్టం చేశారు. మనం చేసిన మార్పులు, అభివృద్ధిని చూసేందుకు దేశవిదేశాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చేలా చేసే బాధ్యత మీదే నని అన్నారు. మనం మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, అధికారులకైనా, రాజకీయ నాయకులకైనా అంతకంటే కావలసినదేముం టుందని ముఖ్యమంత్రి రేవంత్‌ అభిప్రాయ పడ్డారు. చెరు వులకు, నదులకు కట్టలు కట్టిన బ్రిటిషర్లను కొలుస్తున్న ప్రజ లున్న దేశం ఇది..

- Advertisement -

మనలాంటివాళ్లు అలాంటి మంచిపను లు చేస్తే జాతి మరచిపోదని సీఎం హైడ్రా అధికారులకు చెప్పారు. చెరువుల పునరుద్ధరణ విషయంలో ఎన్ని అడ్డం కులు ఎదురైనా ప్రభుత్వం వెనక్కు తగ్గదని, బాధ్యతతో పనిచేసే అధికారులకు వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడ హైడ్రా ఉన్నతాధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కమిటీల్లో కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిపుణులనూ చేర్చుకోవాలి. మిగతా ప్రభుత్వ విభాగాలతో కలసి ముందుకు వెళ్లాలి. సమష్టి బాధ్యతతో పనిచేస్తే విజయం తథ్యమని చెప్పారు.

అప్పుడలా…
ఒకప్పుడు భాగ్యనగరం దాహార్తిని తీర్చిన వేలాది చెరువులు అంతర్థానమయ్యాయి. నిజాం హయాంలో ఒక్క మహానగరంలోనే 3వేల చిన్ననీటివనరులుంటే.. ఇప్పుడు కేవలం 185 మిగిలాయి. ఒకప్పుడు నిజా సంస్థానం పరిథిలో దాదాపు 60వేల తటాకాలుండేవి. తాగు, సాగునీటి అవసరాలు తీర్చేవి. వాటిలో 99 శాతం గొలుసుకట్టు చెరువులు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీటి తరలింపు జరిగేది. ఇప్పుడు వాటిలో 90 శాతం నీటివనరులు అంతర్థానమైనాయి. ఆక్రమణలు అందుకు కారణం. ప్రత్యేకించి 1990-200 మధ్య కాలంలో వచ్చిన ప్రభుత్వ విధానాలు ఈ నీటివనరుల విధ్వంసానికి కారణ మైనాయి. అప్పటి విస్తీర్ణంతో పోలిస్తే ఆక్రమణలవల్ల కుచిం చుకుపోయాయి. పైగా మురికినీటితో కలుషితమైనాయి.

మంచినీటి మాటే లేదు. మూసీ అయినా… హుస్సేన్‌ సాగర్‌ అయినా.. బతుకమ్మ కుంట అయినా అంతే. అందుకే రేవం త్‌ ప్రభుత్వం వీటిని పునరుద్ధరించాలని కంకణం కట్టు కుంది. హైడ్రా పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చిం ది. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఆక్రమణలను తొల గించి, గొలుసుకట్టు చెరువుల తరహాలో నీటి ప్రవాహం సాఫీగా సాగిపోయేందుకు నడుం బిగించింది. కొన్నిచోట్ల వ్యతిరేకతలు, రాజకీయ పార్టీల విమర్శలు.. న్యాయ స్థానాల జోక్యంవంటి కారణాలవల్ల హైడ్రా దూకుడు కాస్త తగ్గింది. అంతమాత్రాన ప్రభుత్వం లక్ష్యంలో మార్పు రాలే దు. చెరువుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోం ది. హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెట్టింది. ఒకవైపు న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కొంటూనే, మరోవైపు నిర్మా ణాత్మక చర్యలకు ఉపక్రమించింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌గా విస్తరించకముందు, హెచ్‌ఎం డీఏ ఏర్పడకముందు హుడా ఉండేది. దాని పరిధిలో ఉండే నీటివనరులకు సంబంధించి కొన్ని నిబంధనలు మార్చ డంతో చెరువుల ప్రాణాలు పోయాయి. పది ఎకరాలకన్నా తక్కువ విస్తీర్ణం ఉండే చెరువులు, కుంటలను కాలనీలు, కమర్షియల్‌ జోన్లుగా అభివృద్ధి చేసుకోవచ్చంటూ హుడా (హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) తీసుకువ చ్చిన చట్టంతో చెరువులు అంతర్ధానమై.. అక్కడ కాలనీలు వెలిశాయి. 1990-2000 మధ్యకాలంలో దాదాపు 3వేల చెరువులు, కుంటలు రూపుకోల్పోయాయి. వందలాది కాలనీలు పుట్టుకొచ్చాయి.

రాజకీయ నాయకులు, రియ ల్టర్లు కుబేరులయ్యారు. కానీ మంచినీటి వనరులు, మురు గునీటి పారుదల వ్యవస్థ ధ్వంసమైనాయి. ఆ తర్వాత హెచ్‌ ఎండీఏ ఆవిర్భావం, మహానగరం గ్రేటర్‌ హైదరాబాద్‌గా రూపాంతరం చెందడం వంటి పరిణామాలు సంభవిం చాయి. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ కుంటలు, చెరు వుల్లో వెలిసిన కాలనీలు జలమయం అవడం, నగరంలో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేక వరదనీరు ఎటూ వెళ్లక రోడ్లు జలమయం అవడం తరచూ ఎదురయ్యే సమస్యే. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా చెరువుల పునరుద్ధ రణపై దృష్టి సారించలేదు.

ఆ ప్రభుత్వాలన్నీ రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ప్రోత్సహించాయి. ప్రభుత్వానికి ఆదాయమార్గం గానే చూశాయి. సామాజిక బాధ్యతను విస్మరించాయి. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారు. ప్రజల నుంచి కూడా విశేషంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికీ చెరు వుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా బతుకమ్మకుంట ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్‌ బుధవారంనాడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సాధారణ పౌరుల అభ్యంతరం ఒక్కటే అన్ని అనుమతులతో ఇళ్లు కట్టుకున్నామని, ఎఫ్‌టీ ఎల్‌, బఫర్‌జోన్‌ వంటి నిబంధనలు తమకు తెలియదని, కూల్చవద్దని కోరుకుంటున్నారు.

నిజానికి 1995లో హుడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే నాటికి దాని పరిథిలో పది ఎకరాలకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న సరస్సులు, చెరువులు, కుంటలు 169 ఉన్నాయి. వీటి లో 62 సరస్సులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనివి. మరో 82 ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనివి. 25 మాత్రం పూర్తిగా ప్రైవేటువి. హుడా నిబంధనల ప్రకారం కూడా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ నిబంధనలున్నాయి. కానీ ఎవరూ పాటించలేదు. 2010లో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవ లప్‌మెంట్‌ అధారిటీ (హెచ్‌ఎండీఏ) ఏర్పడింది. హుడా కన్నా ఎక్కువ పరిథి హెచ్‌ఎండీఏకు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిథిలో 399, ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌ మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐ అండ్‌ సీఏడీ) పరిథిలో 16 నీటివన రులుండేవి. ఆ తరువాత ఏడేళ్లలో ఆక్రమణలు విశ్వరూపం దాల్చాయి. ప్రస్తుతం 185 నీటివనరులు మాత్రం (చెరు వులు, కుంటలు) మిగిలాయి. వాటి అసలు విస్తీర్ణంలో సగానికన్నా ఎక్కువగా ఆక్రమణలపాలైనాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement