Monday, November 25, 2024

మల్లెతీగ కార్టూన్ల పోటీల్లో ఆంధ్రప్రభ కార్టూనిస్ట్‌కు ద్వితీయ బహుమతి

అమరావతి,ఆంధ్రప్రభ : ఘంటా ఇందిర స్మారకంగా మల్లెతీగ నిర్వహించిన కార్టూన్ల పోటీల్లో ఆంధ్రప్రభ కార్టూనిస్టు మాధవ్‌కు రెండో బహుమతి లభించింది. ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ కృష్ణానదీ తీరాన వెలువరించారు. ఫలితాల కరపత్రాలను వెలువరించి బహుమతులు గెల్చుకున్న కార్టూనిస్టుల పేర్లను ప్రకటించారు. 10 వేల రూపాయల అత్యుత్తమ బహుమతిని విజయవాడకు చెందిన బొమ్మన్‌ గెలుచుకున్నారు. 5 వేల రూపాయల ఉత్తమ బహుమతిని హైదరాబాద్‌కు చెందిన మాధవ్‌ గెలుచుకున్నారు. మాధవ్‌ ఆంధ్రప్రభలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు.

500 రూపాయల ప్రత్యేక బహుమతుల్ని వల్లూరి కృష్ణ (హైదరాబాద్‌) పి.చిదంబరం (విజయవాడ), జెన్నా (విశాఖపట్నం), ప్రసిద్ధ (హైదరాబాద్‌), భూపతి (కరీంనగర్‌), గోపాలకృష్ణ (పెనుగొండ), డి.శంకర్‌ (కోరు), ఆదినారాయ(విజయవాడ), నాగిశెట్టి (విజయవాడ), ఎన్‌.శేషయ్య (తిరుపతి), పైడి శ్రీనివాస్‌ (వరంగల్‌), వినోద్‌ (సఖినేటిపల్లి), అరుణ్‌ (హైదరాబాద్‌), మురళీధర్‌ (విజయవాడ) గెల్చుకున్నారు.ఈ

సందర్భంగా బహుమతి ప్రదాత డా.ఘంటా విజయకుమార్‌ మాట్లాడుతూ, గుండెగాయమై రక్తమోడుతున్న పర్యావరణాన్ని, వివిధ రంగాల్ని ప్రభావితం చేస్తున్న రాజకీయరంగాన్ని, తన అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన సోషల్‌ మీడియాని మనిషి మరో కోణంలో ఉపయోగించుకుంటూ తన జీవితాన్ని, మనుగడని, భవిష్యత్తుని, చివరికి దేహాన్ని కూడా ఛిద్రం చేసుకుంటు-న్న విపరీత పోకడల్ని, మసిబారుతున్న మానవీయ విలువల్ని, మానవత్వాన్ని తమ కార్టూన్లలో కార్టూనిస్టులు ప్రతిఫలింపజేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement