Saturday, November 23, 2024

48 గంటల్లో ఏపీలోని అన్ని జిల్లాలకు ట్రూనాట్ కిట్లు

రాష్ట్రంలో కరోనా పరీక్షలపై అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారని.. ఈ మేరకు ట్రూనాట్, రాపిడ్ టెస్టులను కూడా మొదలుపెట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఏపీ నోడల్ అధికారి శ్రీకాంత్ అర్జా తెలిపారు. 48 గంటల్లోపు ట్రూనాట్ కిట్లను జిల్లాలకు పంపి పరీక్షలు మొదలుపెడతామని అన్నారు. వీటి ద్వారా 60 నిమిషాల్లో ఫలితం వెల్లడవుతుందని తెలిపారు. రోజుకు 35 వేల వరకు పరీక్షలు చేస్తున్నామని, ఇంకా 70 వేలకు పైగా ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపారు. బ్యాక్‌లాగ్‌ పెరగటం వల్లనే రిపోర్టులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ర్యాపిడ్ టెస్టులు కూడా వినియోగించి బ్యాక్ లాగ్ పూర్తి చేస్తామన్నారు. అటు 104 కాల్‌ సెంటర్‌కు రోజుకు 10 వేలకు పైగా ఫిర్యాదులు వస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement