Tuesday, November 26, 2024

ఏపీలో వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు

రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. 3 వారాల్లోగా కంపెనీలు తమ ఆసక్తిని తెలపాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక, ఆక్సిజన్‌ సరఫరా, వ్యాక్సినేషన్‌పై చర్చలు జరిపారు. సమీక్షలో చీఫ్ సెక్రటరీ‌ ఆదిత్యనాథ్ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ ఛైర్ పర్సన్‌  కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్‌ తదితరుల పాల్గొన్నారు.

వ్యాక్సిన్ల కొరతను అధిగమించడంలో భాగంగా జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ ఇటెండర్లను పిలవాలని నిర్ణయించారు. త్వరలో బిడ్డింగుల ప్రక్రియను చేపట్టడానికి సిద్ధమవుతోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా ఎంత మొత్తంలో వ్యాక్సిన్‌ ను సమీకరించుకోవాలనేది ఇంకా ఖరారు కాలేదని, దానిపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంటనే బిడ్డింగులను ఆహ్వానిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను కూడా దాఖలు చేసిన నేపథ్యంలో.. అదే విధానాన్ని అనుసరించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే యూపీ సర్కార్ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మైనస్ రెండు డిగ్రీల నుంచి మైనస్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకోవడానికి వీలుండేలా టీకాలను సమీకరించుకోనుంది.  కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తొలి రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్లను సమీకరించుకోవడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనుంది. ఈ దిశగా చర్యలు చేపట్టింది

Advertisement

తాజా వార్తలు

Advertisement