Tuesday, November 26, 2024

ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు.. రేపే విడుదల

పదో తరగతి ఫలితాలపై ఏపీ సర్కారు కీలక ప్రకటన చేసింది. పదో తరగతి పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు సాయంత్రం 5 గంటలకు పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 పదో తరగతి పరీక్షలను ఏపీ సర్కారు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే పరీక్షల ఫలితాల కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది.

అయితే సదరు హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. అలాగే మార్కుల మెమోలను www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా.. కరోనా కారణంగా పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా… ఇటీవలే ఇంటర్‌ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో అందరినీ పాస్‌ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: విశాఖ దేవాదాయ శాఖలో బయటపడ్డ విభేదాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement