అనంతపురంలో భాషా అనే ఫోటోగ్రాఫర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు బంద్ చేపట్టారు. ఓ హోటల్‌లో జరిగిన రిసెప్షన్ కవరేజ్‌కు వెళ్లిన ఫోటోగ్రాఫర్‌పై హోటల్ యాజమాన్యం దాడికి పాల్పడటంతో ఫోటోగ్రాఫర్లు నిరసనకు దిగారు. వెంటనే దాడి చేసిన వారిని శిక్షించాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీలోని అన్ని ప్రాంతాలలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. అనంతపురంలోని ఎస్ ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో అన్యాయంగా ఏ కారణం లేకుండా ఫోటోగ్రాఫర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడి చేసిన వారిపై వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రంలో ఉన్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.