దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది గర్భిణులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన విషయంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 20 లక్షల మందికిపైగా తల్లులకు వ్యాక్సిన్లు వేయగా.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల డోసులు వేసిన 10 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. జూలై 30న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తమిళనాడు 78,838 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తొలి స్థానంలో ఉండగా.. 34,228 మందికి వ్యాక్సిన్ వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు ఒడిశాలో 29,821 మందికి, మధ్యప్రదేశ్‌లో 21,842, కేరళలో 18,423 మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేశారు. గర్భిణులు వ్యాక్సిన్‌కు వెళ్లినప్పుడు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏది కోరుకుంటే అది వేయాలని వ్యాక్సిన్ నోడల్ అధికారి చెప్పారు.
ఈ వార్త కూడా చదవండి: ఏపీలో ఫించన్‌దారులకు తీపికబురు