తనపై దాఖలైన కేసులలో తొలుత ఈడీ కేసులు విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మొదట సీబీఐ కేసులు విచారణ జరిపేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని విజయసాయిరెడ్డి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీలుకాకపోతే ఈడీ కేసులు, సీబీఐ కేసులను సమాంతరంగానైనా విచారణ జరపాలని కోరారు.
దీనిపై ఈడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ… ఈడీ కేసులనే మొదట విచారణ జరిపి, అవసరమైతే తీర్పు వాయిదా వేయాలని సూచించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మొదట వేటిని విచారించాలన్న దానిపై స్పష్టత లేదని న్యాయవాదులు అభిప్రాయపడగా… వివిధ కోర్టు తీర్పులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.
ఈ వార్త కూడా చదవండి: ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు మాట్లాడమేంటి?: హైకోర్టు