Tuesday, November 19, 2024

ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో షాక్

ఏపీలో జగన్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో షాక్ తగిలింది. జీవో నెంబర్‌ 2ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్‌వోలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెం 2ను హైకోర్టు రద్దు చేసింది. జీవోను సవాల్‌ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషనర్‌ తరపున వాదనలను న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వినిపించారు. పంచాయతీ సర్పంచ్‌ అధికారాలు వీఆర్‌వోలకు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను.. వీఆర్‌వోలకు అప్పగించడమేంటని జగన్ ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే తాము వీఆర్వో వ్యవస్థను తీసుకువచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జీవో నెంబర్ 2ను రద్దు చేస్తూ నిర్ణయం వెలువరించింది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో మరోసారి కర్ఫ్యూ వేళల్లో మార్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement