Saturday, November 23, 2024

సినిమా పరిశ్రమకు ఏపీ సర్కారు షాక్

టాలీవుడ్ నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హాళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా కారణంగా పలువురు ప్రజల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండటం.. మళ్లీ ప్రజలు గాడిలో పడుతున్నారు. ఇప్పటికే ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు భగ్గుమంటుంటే.. మరోవైపు పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఇలాంటి తరుణంలో థియేటర్ల యాజమాన్యం టికెట్ రేట్లను పెంచేస్తే.. దాని వల్ల ప్రజలపై మరో భారం పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఏపీలో జూలై 8 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ఇప్పటికే ఏపీ సర్కారు అనుమతులు జారీ చేసింది. 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌తో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. మరోవైపు తెలంగాణలో 100 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి.

ఇది కూడా చదవండి: ఈనెల 30న ‘లవ్ స్టోరీ’ విడుదలయ్యే అవకాశం

Advertisement

తాజా వార్తలు

Advertisement