అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బీఐ నుంచి మరో వెయ్యి కోట్ల రూపాయల రుణం పొందింది. రూ. 500 కోట్లకు 17 సంవత్సరాలకు 7.35 శాతం వడ్డీతో రుణం తీసుకురాగా, మరో రూ. 500 కోట్లు 9 సంవత్సరాలకు 7.40 శాతం వడ్డీతో అప్పు తీసుకుంది. ఈ అప్పుతో 77 రోజుల్లో 20, 500 కోట్లు తీసుకుంది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం కింద 30, 500 కోట్ల అప్పుకు ఎపీ ప్రభుత్వానికి అనుమతించింది. ఇక 10 వేల కోట్లే మిగిలి ఉన్నాయి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కోసం రాష్ట్రం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఇచ్చిన 2014-15 రెవెన్యూ లోటు- 10 వేల కోట్లను ప్రభుత్వం వాడేసుకుంది.
- Advertisement -