ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, నీరసం రావడంతో నారాయణస్వామిని కుటుంబసభ్యులు తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు అక్కడ పరీక్షలు చేయడంతో కరోనా పాటిజివ్‌గా తేలింది. ప్రస్తుతం నారాయణ స్వామికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. తన నివాసంలోనే ఉంచి నారాయణస్వామిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో తనతో ఉన్న వారు కూడా కరోనా చికిత్స చేయించుకోవాలని నారాయణ స్వామి సూచించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా వస్తే ఎవరూ భయపడొద్దని, ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందిస్తోందని నారాయణస్వామి సూచించారు.
ఈ వార్త కూడా చదవండి: కూరగాయలు పండించడానికి సీసీ కెమెరాల ఏర్పాటు