ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చుంటామంటే కుదరదని… పని చేసి పార్టీ అధినేత జగన్ వద్ద మార్కులు సంపాదించాలని చెప్పారు. ఏ మాత్రం తేడా వచ్చినా మంత్రి పదవి ఊడిపోతుందని అన్నారు. ఈ విషయాన్ని తమకు మంత్రి పదవులు ఇచ్చే సమయంలోనే జగన్ చెప్పారని… రెండున్నర సంవత్సరాల తర్వాత మీ అవసరం ఉంటేనే పదవిలో ఉంటారని… లేకపోతే పదవి పోతుందని హెచ్చరించారని తెలిపారు.
తాను మాత్రం ఎంతో నిజాయతీగా, పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేశానని చెప్పారు. ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తనకు జగన్ నుంచి మంచి మార్కులు వచ్చాయని నారాయణస్వామి చెప్పారు.
ఇది కూడా చదవండి: జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ