ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తిరుమల వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం తిరుమల బయలుదేరి వెళ్లనున్న ఆయన ఆధునీకరించిన శ్రీవారి పోటును లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 2018లో శ్రీవారి పోటులో అగ్నిప్రమాదం జరగడంతో టీటీడీ అధికారులు శ్రీవారి పోటును విస్తరించి ఆధునీకరించారు. దీనిని సీఎం జగన్ మంగళవారం ప్రారంభిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. సీఎం వెంట చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కాగా గత ఆరునెలల కాలంలో సీఎం జగన్ తిరుమల వెళ్లడం ఇది రెండోసారి.
Advertisement
తాజా వార్తలు
Advertisement