ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
★ జూలై 8న వైఎస్ఆర్ రైతు దినోత్సవం జరపాలని కేబినెట్ నిర్ణయం
★ రూ.89 కోట్లతో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోలుకు ఆమోదం
★ వైఎస్ఆర్ బీమా పథకానికి కేబినెట్ ఆమోదం
★ జులై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సవం
★ ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80వేల ఆర్థికసాయం
★ మౌలిక వసతుల కల్పనకు రూ.34వేల కోట్లు ఖర్చు
★ ఇళ్లస్థలం పొందిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
★ 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్ టాప్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్
★ నగదు వద్దనుకుంటే అమ్మఒడి ద్వారా ల్యాప్‌టాప్ పంపిణీకి ఆమోదం(ఇప్పటికే 35శాతం తల్లులు ల్యాప్‌టాప్‌లు కావాలని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో.. మూడేళ్ల వారంటీతో ల్యాప్‌టాప్‌లు పంపిణీ)
★ రూ.339 కోట్లతో ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటుకు ఆమోదం
★ విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను వర్శిటీగా మార్పు
★ మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు నిర్ణయం
★ నగరాలు, పట్టణాలకు దగ్గరలో ఉన్న స్థలాలు సేకరించి లాభాపేక్ష లేకుండా మధ్యతరగతి ప్రజలకు కేటాయించాలని నిర్ణయం
★ వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని నిర్ణయం
★ కాకినాడ సెజ్‌లో 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం
★ పీహెచ్‌సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం
★ 2021-24 ఐటీ పాలసీకి కేబినెట్ ఆమోదం