– ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆంధ్రప్రభ- ఇండియా ఎహెడ్ ఎండీ ముత్తా గౌతమ్ మర్యాదపూర్వకంగా భేటీ
– కరోనాపై ప్రజలను మరింత చైతన్యపరచాలి: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాతృ భాష వికాసానికి, విస్తృతికి ప్రస్తుత తరుణంలో మీరు చేస్తున్న కృషి అమోఘమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆంధ్రప్రభ- ఇండియా ఎహెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముత్తాగౌతమ్ కొనియాడారు. హైదరాబాద్లోని నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా ఇద్దరి మధ్యా ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుత కరోనా కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చైతన్యం చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కరోనా కేసులు మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించేలా మీడియా ద్వారా చైతన్యపరచాలని సూచించారు.