పాలమూరు గడ్డపై పుట్టి పెరిగి, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్‌బీఐ చైర్మన్‌గా నియమితులైన తెలుగుబిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్ అభినందించారు. దాదాపు 59 ఏళ్ల తర్వాత తెలుగు వ్యక్తి ఎస్‌బీఐ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
- Advertisement -
తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా, మానోపాడు మండలం, పోతులగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఉన్నత చదువులు చదవడమే కాకుండా నేడు ప్రతిష్టాత్మకమైన హోదాను పొందడం ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణమని ముత్తా గౌతమ్ అభిప్రాయపడ్డారు.