న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ డా. దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్మారక ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి, ఆంధ్రా విద్యా సంఘం యాజమాన్య సభ్యుల చేతుల మీదుగా జ్యోతిప్రజ్జ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ కో చైర్మన్ వి.వి రావు, కార్యదర్శి ఎస్. ఈశ్వర్ ప్రసాద్, యాజమాన్య సభ్యులు సి. చిట్టిబాబు, సి.ఎ. శ్రీధర్, ఎ. తిరుపతి హాజరయ్యారు. ముఖ్య అతిథి అయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి వెంకట రామయ్య తెలుగు భాష గొప్పతనాన్ని, విద్యార్థులు తెలుగు చదువుకోవడం వల్ల భవిష్యత్తులో లభించే అవకాశాలు, మన భాష, సంస్కృతి, సంప్రదాయాయలను పరిరక్షించుకోవలసిన అవసరం గురించి వివరించారు.
ముఖ్య అతిథిని ఏఈఎస్ యాజమాన్య బృందం సన్మానించింది. తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించిన పద్య, గేయ పోటీలు, తెలుగులోనే మాట్లడదాం, తెలుగు నీతి కథల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి