Saturday, November 23, 2024

ఆరు భారతీయ భాషలకు ప్రాచీన హోదా

దేశంలో తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాళం, ఒడియా వంటి భాషలకు భారత ప్రభుత్వం ప్రాచీన భాష హోదా కల్పించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ ప్రాచీన భాషలను యునెస్కో బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చేర్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఒడియా వంటి ప్రాచీన భాషతోపాటు అన్ని భారతీయ భాషల ప్రోత్సాహంపై నూతన విద్యా విధానం దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement