Friday, November 22, 2024

రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌ : సోము వీర్రాజు

నెల్లూరు జిల్లా కావలిలో బిజెపి నేతలపై పోలీసుల అరాచకంగా వ్యవహరిస్తూ ఒక భయానక వాతావారణాన్నిసృ ష్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పేందుకు వెళితే పోలీసులు బీజేపీ నేతల‌పై వ్యవహరించిన తీరుచూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నట్లుగా కనపడుతోంది అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక్కసారిగా పోలీసులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తో సహా పలువురు బీజేపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారు అన్న విషయం పోలీసులు చెప్పడం లేదు అన్నారు. ప్రజాస్వామ్యంలొ ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంద‌న్నారు. పోలీసులు బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాల‌ని, లేదంటే బీజేపీ తన కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో ఆ విధంగా రక్షించుకునే ప్రయత్నం చేస్తామని వైసీపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ నేతలందరినీ బేషరతుగా విడుదల చేయాల‌న్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రభుత్వానికి సమస్యలు చెబుతాం, ఆ దిశగానే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేల అరచాకాలు తెలియ చేయడానికి వెళితే ఒబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సురేష్ ను పోలీసులు బూటుకాళ్లతో తన్నిన సంఘటన చూస్తే రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తున్నట్లుగా ఉంద‌న్నారు. బిజెపి నేతల‌ను బూటు కాళ్ళతో తన్నిన పోలీసులు పై కేసు నమోదు చేయాలి అని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement