Saturday, November 23, 2024

సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఔషధం తయారీ, సామగ్రి తదితర అంశాలకు సంబంధించి సహకారం అందించాలని లేఖలో కోరారు. ఎక్కువ మొత్తంలో మందు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలంలో ఆనందయ్య మందును ఈరోజు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఈ మందును ఇంటింటికీ చేరవేస్తున్నారు. మందు కోసం ఇతర ప్రాంతాల వారిని అనుమతించని పోలీసులు కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ అమలును కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement